- Advertisement -
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భద్రతాబలగాలు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జీడిపల్లి బేస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఈ మెరుపు దాడిలో బీజాపూర్ పోలీసులు అప్రమత్తయ్యారు. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లు ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొంటాలో నవంబర్ 22న భద్రత దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ ఆరుగురు చనిపోయిన విషయం విధితమే. మావోయిస్టులపై విష ప్రయోగం జరిగిందని అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
- Advertisement -