Sunday, December 22, 2024

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కమాండర్‌ మృతి..

- Advertisement -
- Advertisement -

Maoist Cammander killed in Encounter in Dantewada

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఏరియా కమాండర్‌ మృతిచెందారు. శనివారం ఉదయం జిల్లాలోని బుర్గాం అడవుల్లో భద్రతా బలగాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో భద్రత దళాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలులు మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో బుర్గాం ఏరియా మావోయిస్టు కమాండర్‌ లక్మ చనిపోయినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఘటనాస్థలం నుంచి మావోయిస్టుల సామగ్రిని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Maoist Cammander killed in Encounter in Dantewada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News