Friday, December 27, 2024

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్‌ రావు అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్‌రావు అరెస్టయ్యారు. హైదరాబాద్‌లో పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ దీపక్‌రావు అరెస్ట్‌కు సంబంధించిన వి వరాలను డిజిపి అంజనీ కుమార్ మీడియాకు వెల్లడి చేశారు. ప్రస్తుతం పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న సంజయ్ పలువురు మావోయిస్ట్ అగ్రనేతలతో సమావేశాలు జరిపారన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ ట్రైజంక్షన్ ఏరియాలో సంజయ్ దీపక్‌రావు కీలకంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ ఏడాది దీపక్‌రావు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడని, చికిత్స నిమిత్తం రెండు, మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడని వెల్లడించారు. చికిత్స కోసం సందీప్ దీపక్‌రావు హైదరాబాద్‌కు వచ్చినట్లు పక్కా సమాచారంతోనే అరెస్ట్ చేశామన్నారు. కాగా, దీపక్ కోసం కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు వెదుకుతున్నారని పేర్కొన్నారు. దీపక్ కోసం ఎన్‌ఐఎ బృందాలు కూడా గాలిస్తున్నాయని వెల్లడించారు. మహారాష్ట్రలో దీపక్ రావుపై రూ.25 లక్షల రివార్డ్ ఉందని, సందీప్ దీపక్‌రావు అరెస్ట్ మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ అని డిజిపి అన్నారు. దీపక్‌రావు భార్య కూడా కమ్యూనిస్టేనని ఆమెపై కూడా నిఘా పెట్టామని పేర్కొన్నారు. తెలంగాణపై ఎలాంటి మావోయిస్ట్ కార్యకలాపాలు లేవని డిజిపి అంజనీకుమార్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News