ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నేత ఒడిశా మావోయిస్టు కార్యదర్శి గా వ్యవహరి స్తున్న రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మృతి చెందారు. చలపతి రెడ్డి పుట్టిన ఊరు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మత్యం పైపల్లె గ్రామం . చలపతి రెడ్డి చిన్న నాడు తమ గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించి మదనపల్లె తిరుపతిలలో పిజి చేశారు. మదన పల్లిలోని సెరికల్చర్ డిపార్ట్మెంట్ నందు ఉద్యోగిగా పని చేస్తూ విశాఖకు బదిలీ అయ్యారు. విశాఖ జిల్లాలోని మావోయిస్టులతో ఏర్పడ్డ పరిచయం తో మావోయిస్టుల్‌ోల చేరారు. అనతి కాలంలోనే మావోయిస్టులకు అగ్ర నాయకుడుగా ఎదిగారు.
మావోయిస్టు నాయకురాలు అరుణతో ఆయన పరిచయం అపై వివాహం చేసుకున్నారు. గతంలో విశాఖ ఏజెన్సీలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు రామకృష్ణ , చలపతి తప్పించుకోవడంతో వారిని పట్టుకునేందుకు కోటి రూపాయల వరకు రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం చత్తీస్‌ఘడ్‌లో జరిగిన కాల్పుల్లో చలపతి మృతి చెందినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. చలపతి అమ్మానాన్నలో ఇదివరకే మృతి చెందారు. ఇద్దరు అన్నలు ఉండగా ఒక అన్న మృతి చెందారు అతని కుమారుడు గ్రామంలో నివాసం ఉన్నాడు. రెండవ అన్న చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మదనపల్లి లోని పట్టు పరిశ్రమ శాఖలో పనిచేస్తున్నారు. మొదటి నుంచి అభ్యుదయభావాలతో ఉండే చలపతి సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఆవే శంగా స్పందించేవారు. ఆయన విశాఖలోని మన్యంలో పని చేస్తున్న సమయంలో నక్సలిజం ఉద్యమం జోరుగా ఉండేది. ఆ సమయంలో చలపతి భావజాలంతో నక్సల్స్ తోసంబంధాలు మెరుగుపడ్డాయి.
తాను ఇక తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధించి బూర్జువా ప్రజాస్వామ్యం నుంచి దేశాన్ని రక్షించాలన్న సంకల్పంతో అడవుల్లోకి వెళ్లారు. ఉద్యోగాన్ని కూడా వదిలి పెట్టారు. ఆయన నాయకత్వంలో మావోయిస్టు పార్టీ ఎంతో మందిని హత మార్చింది. టిడిపి ఎంఎల్‌ఎ కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమను ఎవొబిలో మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఆపరేషన్ కు చలపతి నాయకత్వం వహించారని చెబుతారు. మరో వైపు చలపతి తన నాయకత్వంలో ఎంతో మంది యువకులకు శిక్షణ ఇచ్చారని చెబుతారు. వయసు పెరగడంతో అనారోగ్యానికి గురవుతున్న సమయంలలో ఆయనను పూర్తిగా శిక్షణా కార్యక్రమాలకే మావోయిస్టు పార్టీ ఉపయోగించు కునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోవడంతో యువ మావోయిస్టుంతా గురువును కోల్పోయినట్లయింంది. ఈ చలపతి ఎంత కీలకమైన వ్యక్తి అంటే హోంమంత్రి అమితా కూడా బలగాలను అభినందించారు.