Friday, November 22, 2024

సిపి ముందు లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

- Advertisement -
- Advertisement -

వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి.రంగనాథ్ ముందు మావోయిస్టు దంపతులు లొంగిపోయరు. గురువారం పోలీస్ కమిషనర్ రంగనాథ్ వారిని నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వారిగా గుర్తించి వారి వివరాలను మీడియా సమక్షంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళ్లగా కాసరనేని రవికుమార్ అలియాస్ అజిత్, ఆలియాస్ మున్నా, ఆలియాస్ సూర్యా, వయస్సు 30, కంబంపాడు గ్రామం, మాచర్ల మండలం, పల్నాడు జిల్లా (పూర్వ గుంటూరు జిల్లా). ఆంధ్రప్రదేశ్, భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ మెంబర్, మణుగూరు ఎల్.ఒ.ఎస్ కమాండర్ పని చేశాడని, మడివి సోమిడి అలియాస్ కల్పన, వయస్సు 25, గుత్తికోయ, బత్తినిపల్లి గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పాల్వంచ ఏరియా కమిటీ మెంబర్, మణుగూరు ఎల్.ఒ.ఎస్ డిప్యూటీ కమాండర్‌గా చేసిందని అన్నారు.

కాసరనేని రవికుమార్ అనే వ్యక్తి స్వగ్రామంలో పదవ తరగతి వరకు చదువుకున్న రవికుమార్ ఇంటర్ మొదటి సంవత్సరంలో చదువును మధ్యలోనే ఆపివేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తమ బంధువుల ఇంటిలో కొద్ది సంవత్సరాలు నివాసం వున్నాడు. ఇదే సమయంలో విప్లవ భావాలు కలిగి వున్న రవికుమార్ 2012 సంవత్సరంలో ఇండియన్ ఫడరేషన్ ఆఫ్ ట్రెడ్ యూనియన్లో జాయిన్ అయినాడు. అనంతరం కొద్ది రోజులకు కొత్తగూడెం కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎంపికకై ఆతర్వాత పిడిఎస్ యూ చేరాడు. పిడిఎస్ యూలో రవికుమార్ చురకుగా పనిచేయడంతో అతనిని కొత్తగూడెం పట్టణ విభాగం పిడిఎస్ యూ అధ్యక్షుడు మరియు ఖమ్మం జిల్లా సభ్యుడిగా, నియమించబడ్డాడు. ఈ సమయంలో రవికుమార్ పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు.

Also Read: స్వచ్చమైన ప్రేమకు మారు పేరు హైదరాబాద్: శేఖర్ కమ్ముల

2016 సంవత్సరంలో మావోయిస్టుల సిద్ధాంతాలకు ఆకర్షితుడై రవికుమార్ తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ పోత్సహంతో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా చేరి చర్ల ఏరియా కమాండర్ సోడి జోగయ్య నాయకత్వంలో పనిచేశాడు. 2017 సంవత్సరంలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేసిన రవికుమార్ 2019 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ మణుగూరు ఎల్‌ఒఎస్ ఏసియం అయిన మడవి సోమిడి అలియాస్ కల్పనను వివాహం చేసుకున్నాడు. 2021 నుండి భద్రాద్రి కొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు డివిజనలలో మణుగూరు, పాల్వంచ, ఏరియా కమిటీ మెంబర్ మరియు మణుగూరు ఎల్.ఒ.ఎస్ కమాండర్గాను, 2022లో కోఅప్షన్ డివిజనల్ కమిటీ మెంబర్‌గా పనిచేశాడు.

మావోయిస్టు పార్టీలో పనిచేసిన సమయంలో రవికుమార్ మావోయిస్టు పార్టీ నాయకులు, దళ సభ్యులతో కల్సి ఛత్తీసఘడ్, ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పులు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, పోలీసు స్టేషన్లు, పోలీస్ పికెట్లు, పోలీసులు ప్రజాప్రతినిధులు, సాధరణ ప్రజలపై దాడులకు పాల్పడిన సంఘటనల్లో రవికుమార్ నిందితుడు. ఇతనిపై ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. మరో వ్యక్తి మడివి సామిడి అలియాస్ కల్పన మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, ప్రసంగాలు, పాటలకు ఆకర్షితురాలైన కల్పన 2017 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరింది. 2018 సంవత్సరంలో చర్ల ఎల్.ఒ.ఎస్ సభ్యురాలిగాను.

2020 సంవత్సరంలో ఏసియం మరియు మణుగూరు ఎల్‌ఓఎస్ డిప్యూటీ కమాండర్ గా పనిచేసింది. 2021 సంవత్సరంలో సుక్మా జిల్లా, జీరమతీ గ్రామంలో పోలీసు బలగాలపై దాడికి పాల్పడిన సంఘటనలో నిందితురాలు, ఇమేపై రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News