Monday, December 23, 2024

మావోయిస్టు కొరియర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం క్రైమ్ : పోలీసులు, స్పెషల్ పార్టీ, 141 బెటాలియన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ముగ్గురు మావోయిస్టు కొరియర్లు పట్టుబడినట్లు జిల్లా ఎస్‌పి డాక్టర్ వినీత్ ప్రకటించారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ చర్ల మండలం దేవనగరం సమీపంలో వీరు పట్టుబడినట్లు తెలిపారు. పూనెం నాగేశ్వరరావు, దేవసూరి మల్లిఖార్జునరావు, పల్లె పోగుల ఉమాశంకర్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా వీరు నిషేధిత మావోయిస్టు పార్టీ పామేరు ఏరియా కమిటీ, బెటాలియన్‌కు కొరియర్లుగా పనిచేస్తూ వారికి అవసరమైన సామగ్రిని అందజేస్తున్నారని వివరించారు. గ

త నాలుగు నెలల క్రితం ఆ పార్టీ అగ్రనేతల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి డ్రిల్లింగ్ మిషన్ కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం పేలుడు పదార్థాలు, డ్రోన్, లేత్ మిషన్‌ను సరఫరా చేసేందుకు వెళుతుండగా పోలీసులకు పట్టుబడ్డారని చెప్పారు. వారి నుంచి పది జిలెటెన్ స్టిక్స్, కార్డెక్స్ వైర్ 160 మీటర్లు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు 5, డ్రోన్ 1, లేత్ మిషన్ 1 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రాల్లో పలు విధ్వంసకర సంఘటనలకు పాల్పడి మావోలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని, అమాయక ఆదివాసీలను భాగస్వాములను చేస్తూ బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలో సహించబోమని హెచ్చరించారు. లొంగిపోవాలని అనుకునే వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లలో సంప్రదించాలని ప్రభుత్వ పరంగా పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News