Thursday, December 26, 2024

బీజాపూర్ లో ఎన్ కౌంటర్: మావోయిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

Maoist dead in bijapur

రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జవాన్ రాము హేమ్లా గాయపడ్డాడు. గాయపడిన జవాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కైకా-మౌస్లా గ్రామ శివార్లలో మావోలు సంచిరిస్తున్నారని సమాచారం రావడంతో డిఆర్ జి- కోబ్రా బలగాలు కూబింగ్ నిర్వహించాయి. భద్రతా బలగాలు కనపించగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టు నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యుడు, సాండ్రా లాస్ డిప్యూటీ కమాండర్ పూణేం రితేష్ దుర్మరణం చెందాడు. ఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి, విప్లవ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. పలు హత్యలు, దోపిడీలు, వాహనాలు దహనం చేసిన ఘటనా ప్రధాన నిందితుడిగా రితేష్ ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. రితేష్ తలపై రూ.3 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News