ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వాపెల్లి లో మావోయిస్టుల డంప్ కలకలం రేపుతుంది. కాల్వపెళ్ళి గ్రామ శివారులో పిరీల కృష్ణయ్య అనే రైతు పొడు భూమిలో ట్రాక్టర్ తో దున్నుతుండగ ఇనుప డ్రంపు బయటపడింది. భూమిలో డ్రంబును చూసి డంప్ గా భావించి రైతు పీరయ్య, ట్రాక్టర్ డ్రైవర్ వాసం కిరణ్ లు పొలం నుండి వెళ్ళిపోయారు. 20 ఏళ్ల క్రితం మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కాల్వపెళ్ళి డంపులో నగదు, ఆయుధాలు దొరికాయనీ ప్రచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పసర సి.ఐ నేతృత్వంలో డంప్ ప్రదేశాన్ని డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో పోలీసులు పరిశీలించారు. ఇనప డ్రమ్ములో ఎలాంటి నగదు మందు కూడా సామాగ్రిలేదని తేల్చి పోలీసులు చెప్పారు.
అయితే రైతు పీరయ్య, ట్రాక్టర్ డ్రైవర్ వాసం కిరణ్ అదుపులో తీసుకుని డంపు విషయం పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిం చారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన పని లేదని పోలీసులు వెల్లడించారు. ఎటువంటి సమాచారాన్ని అయినా సరే పోలీసులకు తెలిపాలని సూచించారు. పీరయ్యకు పొలం పనులు చేసేప్పుడు ఇంకా ఏమైనా ఇటువంటివి వుంటే సమాచారం అందించాలని కోరారు. పొలం పనులు చేసుకు నేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు ఇటువంటి డంప్‌లు ఇంకా వున్నాయా? అని పోలీసులు అనుమానిస్తున్నారు.