Monday, December 23, 2024

మావోయిస్టు దళ కమాండర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : చర్ల పరిధిలోని తాలిపేరు డ్యామ్ సమీపంలో స్థానిక పోలీసులు, 141 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలో పామేడు ఎల్‌వోఎస్ దళాకమాండర్ గొట్ట బుజ్జి అలియాస్ కమల, లక్ష్మీలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి డాక్టర్ వినీత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్నల్లి గ్రామానికి చెందిన ఈమె తన 15వ ఏట దండకారణ్యంలోని మావోయిస్టు పార్టీ పచ్చిమ బస్తర్ డివిజన్ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సెక్రటరీ అయినా మాధవి అనే మావోయిస్టు వద్ద గార్డుగా పనిచేసినట్లు వివరించారు.

2014 ఏడాది ఆపార్టీ అగ్ర నాయకత్వం పశ్చిమ బస్తర్ నుంచి సౌత్ బస్తర్ డివిజన్‌కు బదిలీ చేసిందని,కమిటీకి ఎటాచ్‌మెంట్ చేశారని పేర్కొన్నారు. 2015 సంవత్సరంలో పామేడు ఎల్‌వోఎస్ కమాండర్‌గా పదోన్నతి పొంది ఇన్‌పాస్ తుపాకి కలిగి ఉన్నట్లు చెప్పారు. పోలీసులను హతమార్చేందుకు ఇతర మావోయిస్టు దళ, మిలీషియా సభ్యులతో కలిసి తాలిపేరు డ్యామ్ వద్దకు వస్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆమె నుంచి 3 కేజిల సామర్ధం కలిగిన స్టీల్ క్యాన్, 5 జిలిటెన్ స్టిక్స్, ఒక ఎలక్ట్రిక్ డిటోనేటర్, రెండు సిరంజీలు, నాలుగు బ్యాటరీలు, సుమారు 50 మీటర్లు పొడవు కలిగిన కార్డెక్స్ వైర్, 30 మీటర్ల బండిల్‌తో ఉన్న ఎలక్ట్రిక్ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని చర్ల పోలీస్ స్టేషన్‌లో పది, దుమ్ముగూడెం 1, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం పామేడు పరిధిలో 6, కిష్టారం 09,ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2, తర్రెం, చింతగుప్ప పరిధిలో 1 చొప్పున మొత్తం 30 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునే చర్యలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. అదే సమయంలో సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకునే మావోలు తమకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా జీవనోపాధి, పునరావసం కల్పిస్తామని, అన్నిరకాల ప్రతిఫలాలు అందించేందుకు తమ శాఖ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News