Monday, December 23, 2024

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు దళ సభ్యుడు హతం

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అల్లిగూడెం అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందారు. కాగా గురువారం తెల్లవారుజామున ఈ ఫైరింగ్ జరిగింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలోని బుద్ధారం వాసి. కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగింది. వడ్డిపేట- పూసుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా గ్రే హౌండ్స్ బృందం, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు మావోలు మృతిచెందారు. మృతుల్లో ఒకరు ఐవోఎస్ కమాండర్ రాజేశ్‌గా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News