Wednesday, January 22, 2025

పోలీస్ బేస్ క్యాంప్‌పై నక్సల్స్ దాడి.. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో జాగుర్‌గుండా పోలీస్ స్టేషన్ పరిధి లోని పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయియిస్టులు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేయడంతో భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు కమాండర్ హిడ్మా స్వస్థలపైన పూర్వాతి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపిన వివరాల ప్రకారం జాగుర్‌గుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్‌ల బేస్ క్యాంపుపై మావోయిస్టులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి క్యాంపు సమీపంలో మోహరించిన మావోయిస్టుల బృందం ఒక్కసారిగా 1520 సార్లు యూబీజీఎల్‌తో (అండర్ బారెల్ గ్రానెడ్ లాంచ్) దాడికి పాల్పడినట్టు తెలిపారు.

మావోయిస్టులు దాడి ప్రారంభించిన వెంటనే భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారని, దీంతో వారు పారిపోయారని పేర్కొన్నారు. అనంతరం శనివారం తెల్లవారు జాము నుంచి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. బస్తర్‌ఫైటర్లు, డీఆర్జీ పోలీస్‌లు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా భద్రతా దళాల పైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీస్‌ల ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సంఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News