హైదరాబాద్ : అల్లూరి జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత జనుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ పట్టుబడినట్టు సీలేరు పోలీసులు వెల్లడించారు. రైనో నుంచి ఐఈడీ, తుపాకీ, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వం రైనోపై రూ. 5 లక్షల రివార్డు ప్రకటించినట్టు పోలీసులు చెప్పారు. మావోయిస్టు రైనోపై పలు కీలక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.
2018 సెప్టెంబర్ 23న జరిగిన మాజీ ఎంఎల్‌ఎలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలే హత్యకేసులో రైనో ప్రధాన నిందితుడని పోలీసులు వివరించారు. ఎవొబి ప్రత్యేక జోన్ డివిజినల్ కమిటీ సభ్యుడిగా ఉన్న రైనో ఎవొబిలో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇతను ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారాడు. 2018 సెప్టెంబర్ 23న జరిగిన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్య కేసులు సంచలనంగా మారాయి.