- Advertisement -
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ కన్నుమూశారు. మార్చి 31న గుండెపోటుతో సుదర్శన్ మరణించినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్ట్ 3 వరకు కటకం సుదర్శన్ స్మృతిలో సంతాప సభలు నిర్వహించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాలబస్తి సుదర్శన్ స్వస్థలం. కాలేజ్ సమయంలో కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్శితుడైన సుదర్శన్ 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. తర్వాత మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సుదర్శన్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.
- Advertisement -