మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్ట్ దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీ భార్య పోతుల కల్పన అలియాస్ సు జాతక్క(60)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ని మహబూబ్‌నగర్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తు తం ఆమె సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా పని చేస్తున్నారు. కేంద్ర కమిటీ స భ్యురాలిగా పని చేస్తున్నారు. ఆమె కల్పన అలియాస్ సుజాతక్క, మైన్‌బాయి, పద్మ, ఝాన్సీబాయిని పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగు తున్నది. ఆమె భర్త కిషన్‌జీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న సమయంలో 2011లో పశ్చిమ బెంగాల్ జార్గ్రామ్లోని బురిషోల్ జరిగిన ఎదురు కాల్పు ల్లో ప్రాణాలు కోల్పోయారు. కిషన్ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా.
ఆయన సోదరుడు సైతం మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీలో కొనసా గుతు న్నారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. కిషన్ జీ భార్య సుజాతక్క సైతం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కిషన్‌జీ ఎన్కౌంటర్లో చనిపోయి నప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.అయితే, ఛత్తీస్‌గఢ్ సౌత్ బస్తర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఉంటున్నారని పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసుకునే ఆమె ఎందుకు బయటకు వచ్చారనే విషయం తెలియరాలేదు. అయితే, వైద్య పరీక్షల కోసం మహబూబ్‌నగర్‌కు వచ్చారా? షెల్టర్ జోన్లో ఉంటున్నారా? అన్న సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఆమెను ఎప్పుడు.. ఎక్కడ ? అరెస్ట్ చేశారన్న వివరాలు సైతం తెలియాల్సి ఉంది. సూజాతక్క క్రాంతికారీ జనతన్ సర్కారు వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెను అరెస్టుపై పోలీసు వర్గాలు అధికారిక ప్రకటన చేయలేదు.