Friday, December 20, 2024

మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మంథని/మంథని రూరల్: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, అలియాస్ సాయన్న, అలియాస్ మీసాలన్న, అలియాస్ అలోక్, అలియాస్ దేశ్ పాండే అలియాస్ గోపన్న అనారోగ్యంతో మృతి చెందాడు. మండలంలోని ఎగ్లాస్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శాస్రుతలపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడుగా పని చేస్తున్నారు. 2009లో రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా 2013లో విడుదల కాగానే తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రస్తుతం రాజిరెడ్డి వయస్సు 70 ఏళ్లు. ఆయనను పట్టిస్తే కోటి రూపాయల నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఛత్తీస్‌ఘఢ్, ఒరిస్సా దండకారణ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, అలియాస్ దేశ్ పాండే, సత్తెన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరైన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇంచార్జిగా పని చేశారు. రాజిరెడ్డికి స్నేహలత అనే ఒక కూతురు ఉంది. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్‌లో పని చేస్తున్న కాలంలో ఆమెను ఉద్యమ సహచరుడు ఓయూ ప్రొఫెసర్ కాశీం పెళ్లి చేసుకున్నారు. 1975లో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు. గణపతికి సమకాలీకుడిగా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

2007 కేరళలో అరెస్ట్ అయ్యారు. తన సొంత మండలమైన మంథని కోర్టుకు హాజరై బెయిల్ పొంది, మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. మంథని కోర్టుకు హాజరైనప్పుడు ఆయనను చూసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. ఆ సమయంలో ఆయన విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం చేసుకుంటూ కోర్టు నుంచి బయటకి రావడాన్ని మంథని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో మృతి చెందినట్లు ఛత్తీస్‌ఘఢ్ పోలీసులు కేంద్ర కమిటీ పోలీసులు ధృవీకరించారు. తన అన్న మృతి చెందిన వార్త తెలియగానే హైదరాబాద్ నుంచి సోదరుడు బీమ్‌రెడ్డి అతని భార్య స్వగ్రామం చేసుకొని బోరుమని విలపించారు. తన అన్న పార్థివదేహాన్ని స్వగ్రామమైన శాస్ర్తులపల్లికి తీసుకురావాలని మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News