Monday, December 23, 2024

మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే భార్య శిరీష అరెస్టు

- Advertisement -
- Advertisement -

మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే భార్య శిరీష అరెస్టు
అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

మనతెలంగాణ, సిటిబ్యూరో: మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె భార్య శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. గుంటూరులో ఉంటున్న శిరీష అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం విజయవాడకు వెళ్లి వచ్చే సరికి ఎన్‌ఐఏ అధికారులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. శిరీష వచ్చిన వెంటనే ఆమెను, దుడ్డు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. వీరు మావోయిస్టుల నుంచి భారీగా నిధులు తీసుకున్నారని పేర్కొన్నారు.ఈ విషయం ఆరెకె డెయిరీ ఆధారంగా అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 2019 తిరియా ఎన్‌కౌంటర్‌లో ప్రభాకర్, శిరీష ఇద్దరు పాల్గొన్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. మావోయిస్టుల కోసం రిక్రూట్‌మెంట్ కూడా వీరు నిర్వహిస్తున్నారని తెలిపారు. మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News