Thursday, January 23, 2025

ఎన్ఐఎ అదుపులో దివంగత మావోయిస్టు భార్య ఆర్కే శిరీష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను శుక్రవారం ఎపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూర పాడుకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు మూడు కార్లలో వచ్చి శిరీషను తీసుకెళ్లడం చర్చనీయాంశం అయింది. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అడ్డుపడినప్పటికీ పోలీసులు వారిని పక్కకి నెట్టివేసినట్టు సమా చారం.

ఆర్కే భార్య శిరీష నివాసంలో ఎన్‌ఐఎ, ఇతర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పలుమార్లు సోదాలు జరిపాయి. సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమి టీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ 2021 అక్టోబర్ 14న దక్షిణ బస్తర్‌లో మరణించారు. కిడ్నీ వైఫల్యం, ఇతర వ్యాధులతో మరణించినట్లు మావోయిస్టు పార్టీ అప్పట్లో ధృవీకరించిన విషయం విదితమే. కాగా, శిరీష కూడా గతంలో నక్సల్ ఉద్యమంలో పని చేశారు. ఉద్యమంలో ఉన్నప్పుడే ఆర్కేను పెళ్లి చేసుకున్నారు. ఉద్యమం నుంచి బయటికి వచ్చిన శిరీష ప్రకాశం జిల్లాలో ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News