- Advertisement -
గువహతి: అసోంలో మావోయిస్ట్ అగ్రనేత తింగ్‌రాజ్ ఒరాంగ్(49) మంగళవారం ప్రభుత్వం ముందు లొంగిపోయారు. గువహతిలో అడిషనల్ డిజిపి హిరేన్‌నాథ్ సమక్షంలో ఆయన లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీ అసోం రాష్ట్ర కమిటీకి కన్వీనర్‌గా, బరాక్‌బ్రహ్మపుత్ర జోనల్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఒరాంగ్ లొంగిపోవడం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాకు చెందిన ఒరాంగ్ 1989 నుంచి 1999 వరకు ఎస్‌ఎఫ్‌ఐ, సిపిఐ(ఎం)ల్లో పని చేశారు. 2006లో మావోయిస్ట్ పార్టీలో చేరారు. 2011లో ఒడిషాలోని రూర్కీలో ఇద్దరు సహచరులతో అరెస్టయిన ఒరాంగ్, విడుదలైన తర్వాత తిరిగి మావోయిస్ట్‌ల కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తాజా లొంగుబాటు సమయంలో ఆయన వద్ద ఎలాంటి ఆయుధం లేదని పోలీసులు తెలిపారు.
- Advertisement -