న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో మావోయిస్టు నాయకుడు సామ్రాట్ చక్రవర్తి అలియాస్ నీల్‌కమల్ సిక్దర్‌ను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఎ మంగళవారం ప్రకటించింది. నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు)కి చెందిన దళాలను అస్సాంలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఎ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన సేట్ బగన్ రోడ్డులో నివసించే 37 సంవత్సరాల చక్రవరికి అమిత్, అర్ఘ, నిర్మల్, నిర్మాణ్ అని కూడా పిలుస్తారు. కల్యాణి ఎక్స్‌ప్రెస్‌వేపైన నారాయణ స్కూలు సమీపంలోని మహిస్పాత వద్ద చక్రవర్తిని అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఎ ప్రతినిధి తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మావోయిస్టు కేంద్ర కమటీ సభ్యుడు, పార్టీ సిద్ధాంతకర్త, వ్యూహకర్త అరుణ్ కుమార్ భట్టాచార్జీ అలియాస్ జ్యోతిష్, అలియాస్ కబీర్, అలియాస్ కనక్, అలియాస్ కాంచన్‌దా అరెస్టుకు సంబంధించిన కేసులో చక్రవర్తి అరెస్టు జరిగినట్లు ఆయన చెప్పారు.
బెంగాల్‌లో మావోయిస్టు సభ్యుడు అరెస్టు: ఎన్‌ఐఎ
- Advertisement -
- Advertisement -
- Advertisement -