Tuesday, January 21, 2025

మావోయిస్టు పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయింది: డిజిపి

- Advertisement -
- Advertisement -

Maoist party def unction in Telangana

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయిందని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. మహిళా మావోయిస్టు నాయకురాలు ఉషారాణి శుక్రవారం ఉదయం తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడారు. మావోయిస్టు పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు. మావోయిస్టు పార్టీలో ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉందన్నారు. విలీనం సమయంలో గ్రూపుల మధ్య విభేదాలు వచ్చాయని, మావోయిస్టు అగ్రనేతలంతా అనారోగ్య పాలయ్యారన్నారు. అనారోగ్యానికి గురైన మావోయిస్టులు లొంగిపోతే వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఎన్‌సిసి, మావోయిస్టుల మధ్య వభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News