Monday, April 21, 2025

ఎన్‌కౌంటర్ లో కోటి రివార్డు ఉన్న మావోయిస్టు హతం

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ఝార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. లాల్‌పానియా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోలు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలకనేత ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ పుచన, నాగ మాంఝీ, కరన్, లెతర హతమయ్యారు. ప్రయాగ్ మాంఝీ పేరు మీద కోటి రూపాయల రివార్డు ఉంది. మృతి చెందిన ఎనిమిది మందిలో అరవింద్, రామ్ మాంఝీలపై కూడా పది లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. మావోయిస్టు అగ్రనేత ప్రయాగ్ మాంఝీ దాదాపులో వందకు పైగా దాడులలో పాల్గొన్నట్టు సమాచారం. ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో అతడిపై 50కి పైగా కేసులు ఉన్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడైన మాంఝీ ప్రస్తుతం ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్నాడు.

పరస్నాథ్ ప్రాంతంలోకి మాంఝీ ప్రవేశించినట్టు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం తెల్లవారుజామున సిఆర్‌పిఎఫ్, పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు రాకను గమనించిన మావోయిలు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మాంఝీతో సహా ఎనిమిది మావోలు చనిపోయారు. మిగిలిన మావోలు అడవిలోకి పారిపోయారని భద్రతా బలగాలు ప్రకటించాయి. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 2024లో సంవత్సరంలో ప్రయాగ్ మాంఝీ భార్య జయా మాంఝీకి క్యాన్సర్ వ్యాధి రావడంతో చికిత్స తీసుకోవడానికి ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయా మాంఝీ మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News