- Advertisement -
రాంచి : ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో 145 కేసుల్లో వాంటెడ్ నేరస్థునిగా ఉన్న మావోయిస్టు రీజినల్ కమాండర్ ఇందాల్ గంఝు పోలీస్‌ల ఎదుట గురువారం లొంగిపోయారు. లాలన్ గంఝు లేదా ఉమగా పేరు మోసిన ఇందాల్ గంఝు తలపై రూ. 15 లక్షల రివార్డు ఉంది. ఝార్ఖండ్ లోని చాట్ర, హజారీబాగ్, పాలం జిల్లాల్లో , బీహార్ లోని గయ, ఔరంగాబాద్,
Also Read: కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన బజరంగదళ్ కార్యకర్తలు
జిల్లాల్లోను మొత్తం 145 కేసులు ఆయనపై నమోదై ఉన్నాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకార్ చెప్పారు. ఈ మావోయిస్టు లొంగుబాటు లోను, యాంటీ మావోయిస్టు ఆపరేషన్ లోను భారీ విజయంఝార్ఖండ్ పోలీస్‌లు భారీ విజయంసాధించడం మరో మైలురాయిగా ఆయన ప్రశంసించారు. గత నెల చాట్ర జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.
- Advertisement -