Saturday, December 21, 2024

సొంత గ్రామానికి చేరుకున్న మావోయిస్టు శంకర్రావు దంపతుల మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్ కౌంటర్ జరగగా.. 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ కు చెందిన మావోయిస్టు అగ్ర నేత సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య సుమన అలియాస్ రజిత ఉన్నారు. వారిద్దరి భౌతిక కాయాలు స్వగ్రామానికి చేరుకున్నాయని, నేడు అంత్య క్రియలను నిర్వహించనున్నట్లు బంధువులు చెప్పారు. కాగా, శంకర్రావుపై రూ. 25 లక్షల రివార్డు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News