Monday, January 20, 2025

మావోయిస్టు సానుభూతిపరుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కాటారం : మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన కాటారం పోలీసులు. మంగళవారం కాటారం సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో మీడియా ముందు హాజరుపర్చారు. కాటారం డిఎస్పీ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కాటారం ఎస్సై సుధాకర్ పోలీస్ సిబ్బంది, 58జి బెటాలియన్ సిఆర్‌పిఎఫ్ సిబ్బందితో కలిసి కాటారం మండలకేంద్రంలోని బొప్పారం మూలమలుపు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా వ్యక్తి బైక్‌పై వచ్చాడు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. ఆ వ్యక్తిని విచారింగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంకు చెందిన పోలం రాజయ్య గా గుర్తించారు. ధర్మారం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ స్కీంపై హెల్పర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు.

చిన్ననాటి నుండి మావోయిస్టు విప్లవభావాలకు ఆకర్షితుడై దుమ్మాటి అర్జున్ అలియాస్ నాగన్న అతని భార్య నిర్మల కమాండర్‌గా పెద్దపల్లి దళంలో చేరినట్లు తెలిపారు. దళంలో కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ కూడా పని చేసే వాడని అతని పరియంతో ఆరు నెలల తర్వాత వరంగర్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన ప్రొటెక్షన్ ప్లాన్లో కమాండర్ జగన్ వద్ద చేరినట్లు తెలిపారు. కంకణాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు నిషేధిత మావోయిస్టు పార్టీ కోసం కొత్తగా రిక్రూట్‌మెంట్ కొరకు తనకు తెలిసిన కొంత మందిని పార్టీ భావజాలలు ఉన్న వ్యక్తులను పోత్సహించేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు.

మంగళవారం రాజిరెడ్డి ఆదేశాల మేరకు పోలం రాజయ్య తన వద్ద ఉన్న సామాగ్రి కరపత్రాలు తీసుకొని అతనిని కలవడానికి తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దుకు వెళుతుండగా పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. అతని వద్ద విప్లవ సాహిత్యం, ఆరు కరపత్రాలు, నాలుగు మందు ఉండే సామాగ్రి కవాసకి కంపెనీకి చెందిన బాక్సర్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన రాజయ్యను రిమాండ్‌క పంపినట్లు డిఎస్పీ తెలిపారు. మావోయిస్టుల ప్రలోభాలకులోనై యువత చెడు దారి పట్టవద్దని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రంజిత్‌రావు, సిఆర్‌పిఎఫ్ సిఐ, కాటారం ఎస్సైలు శ్రీనివాస్, సుధాకర్, కొయ్యూరు ఎస్సై, పోలస్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News