Thursday, December 19, 2024

మావోయిస్టు అగ్రనేత భార్య రజిత అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భార్య రజితతో పాటు మరో ముగ్గురు దళ సభ్యులను భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల లోతట్టు ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలని రాష్ట్ర పౌరహక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణ రావులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మావోయిస్ట్ మిలిటరీ ఇంచార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భార్య చర్ల మావోయిస్టు ఏరియా కమాండర్ రజిత,మరో ముగ్గురు దళ సభ్యులకు పోలీసులు ఎలాంటి ప్రాణ హాని తలపెట్టకుండా కోర్టులో హాజరు పరచాలని ఆ ప్రకటనలో కోరారు. ఈక్రమంలో రజిత అరెస్ట్‌ను భద్రాది కొత్తడూడెం పోలీసులు ఇప్పటివరకు ధృవీకించలేదని, అయితే భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల లోతట్టు ప్రాంతంలో ప్రాంతంలో బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కొత్తగూడెం పోలీసులు వారిని అరెస్టు చేశారని వారి కుటుంబసభ్యులు పౌర హక్కుల సంఘానికి సమాచారమిచ్చారన్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా కోర్టులో హాజరుపరచాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో దుమ్ముగూడెం మండలం నూకల పల్లి గ్రామానికి చెందిన వారున్నారని, వీరిని కొత్తగూడెం ఎస్‌పి కార్యాలయానికి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు పౌరహక్కుల సంఘం సభ్యులకు తెలిపారన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని భద్రాద్రి, అల్లూరి జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ సైతం బుధవారం ఓ లేఖ విడుదల చేశారు.

Maoist Top Leader Damoder’s Wife Rajita Arrested

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News