Wednesday, January 22, 2025

ఇంట్లో దాక్కున్న మావోలు…

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామ సమీపంలోని ఒకరి ఇంటిలో ఉన్న నలుగురు మావోయిస్టులను నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత ఆరునెలల నుంచి నలుగురు మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు అనుమానించాయి. శనివారం ఇందారం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక మాజీ మావోయిస్టు ఇంటిలో వారు ఉన్న విషయాన్ని తెలుసుకున్న నిఘా వర్గాలు ఆ ఇంటిని చుట్టిముట్టాయి. నలుగురి వద్ద ఆయుధాలు ఉన్నాయా? లేదా అనే విషయం ఇంకా నిఘా వర్గాలకు స్పష్టం కాలేదు. స్థానిక పోలీస్ బలగాలు కూడా ఆ ఇంటికి చేరుకుంటున్నాయి. నలుగురు మావోయిస్టులు లొంగిపోని నేపథ్యంలో ఎదురుకాల్పులు జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పిఎల్జిఎ వారోత్సవాల నేపథ్యంలోనే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోడానికే వచ్చినట్టు తెలుస్తోంది. స్థావరం పొందిన నలుగురు మావోయిస్టుల హోదా కూడా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News