Tuesday, November 5, 2024

జార్ఖండ్‌లో రైలు పట్టాలు పేల్చేసిన మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

చాయిబసా: నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో కొంత మేర రైలు పట్టాలను పేల్చివేశారు. దీంతో కోల్‌కతాముంబయి మార్గంలో రైలు సర్వీసులకు అనేక గంటలపాటు అంతరాయం ఏర్పడిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటన కారణంగా కనీసం 13 రైళ్లను రద్దు చేయగా, మరో రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పారు. తూర్పు రైల్వేకు చెందిన చక్రధర్ పూర్ డివిజన్‌లో మహాదేవ్‌శాల్, పోసోయితా స్టేషన్ల మధ్య గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని పశ్చిమ సింగ్భమ్ జిల్లా ఎస్‌పి అశుతోష్ శేఖర్ చెప్పారుఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, శుక్రవారం ఉదయంనుంచి రైలు మార్గానికి మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. మావోయిస్టులు ఘటన ప్రాంతంలో బ్యానర్లు, పోస్టర్లు కూడా పెట్టినట్లు ఎస్‌పి తెలిపారు.

శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో డివిజన్‌లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు చక్రధర్‌పూర్ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ వినీత్ కుమార్ చెప్పారు. గురువారం రాత్రి 10.08 గంటల ప్రాంతంలో మహాదేవ్‌శాల్, పోసోయితా రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై పేలుడు సంభవించిందని, ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన ఈ పేలుడులో దాదాపు రెండు, మూడు మీటర్ల మేర రైలు పట్టాలు ధ్వంసమయ్యాయని కుమార్ తెలిపారు. ఈ ఘటన కారణంగా సమర్సత ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించగా, మరో 13 రైళ్లను రద్దు చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది. మావోయిస్టులు ఈ నెల 16నుంచి నిరసన వారం పాటిస్తుండగా, శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News