Wednesday, January 8, 2025

9మంది జవాన్లు బలి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లో ఐఇడి పేల్చిన మావోయిస్టులు
బీజాపూర్ జిల్లా కుట్రుఖేద్రె రహదారిలో దారుణం
మరో ఆరుగురికి తీవ్ర గాయాలు బీజాపూర్
ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
మన తెలంగాణ/చర్ల/బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో ని బీజాపూర్ జిల్లా, కుట్రూ ఖేద్రే రహదారిలో మావోయిస్టులు సోమవారం ఘాతుకానికి తెగబడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐ ఇడి బాంబుతో పేల్చివేయడంతో డ్రైవర్ సహా 9 మంది జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. వాహనంలో మొత్తం 15 మంది జవాన్లు ఉం డగా వారిలో 9 మంది మృతి చెందగా మిగిలిన ఆరుగురికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. భద్రతా బలగాలు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బీజాపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం లో బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా యి. ఒక కార్యక్రమం నిర్వహించిన అనంతరం భద్రత సిబ్బంది తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డిఆర్‌జి రాష్ట్ర పోలీస్ శాఖ లో ఒక విభాగం. ‘దంతెవాడ, నారాయణ్‌పూర్, బీజాపూర్‌లో ఒక సంయుక్త కార్యక్రమం అనంతరం భద్రత సిబ్బంది బేస్ క్యాంప్‌కు తిరిగి వ స్తుండగా

సోమవారం మధ్యాహ్నం సుమారు 2. 15 గంటలకు బీజాపూర్ జిల్లా కుట్రు పో లీ స్ స్టేషన్ పరిధిలోని అంబెలి గ్రామం సమీపం లో ఐఇడిని మావోయిస్టులు పేల్చివేశారు’ అని బస్తర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజిపి) తెలియజేశారు. దీనిపై త్వరలోనే ఒక సమగ్ర ప్రకటన విడుదల చేస్తామని ఐజిపి తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో భద్రత సిబ్బందిపై నక్సలైట్లు పాల్పడిన అతిపెద్ద దాడి ఇది అని ఆయన చెప్పారు. 2023 ఏప్రిల్ 26న పొరుగున ఉన్న దంతెవాడ జిల్లాలో భద్రత సిబ్బంది ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలో ఒక వాహనాన్ని నక్సల్స్ పేల్చివేసిన ఘటనలో పది మంది పోలీస్ సిబ్బంది, ఒక పౌర డ్రైవర్ మృతి చెందారు. తాజా ఘటనలో భద్రత సిబ్బంది మృతి పట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘అత్యంత బాధాకరమైనది’గా ఆయన పేర్కొన్నారు. బస్తర్‌లో భద్రత బలగాలతో ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు హతమైన మరునాడు ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News