Monday, December 23, 2024

భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు….. ఏజెన్సీల్లో హై అలర్ట్

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి: మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో ఏజెన్సీల్లో హై అలర్ట్ ప్రకటించారు. మన్యంలో గాలింపు చర్యలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం, వాజేడు సమీప అటవీ ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. టార్గెట్ లిస్ట్‌లో ఉన్న నేతలను పోలీసులు అప్రమత్తం చేశారు. వ్యాపారులు బంద్ పాటించడంతో రహదారులు నిర్మానుషంగా మారాయి. బంద్ నేపథ్యంలో గిరిజన పల్లెలు భయాందోళనకు గురవుతున్నాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News