Sunday, December 22, 2024

గయా జిల్లాలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు…

- Advertisement -
- Advertisement -

Maoists detonate landmines in Gaya district

బిహార్‌: గయా జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సిఆర్పీఎఫ్‌ ఆఫీసర్‌ సహా ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో సిఆర్పీఎఫ్‌కు సంబంధించిన కోబ్రా కమాండో దళం మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టింది. ఈక్రమంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సిఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ విభోర్‌ కుమార్‌ సింగ్‌ తీవ్రంగా గాపడ్డారు. పేలుడు ధాటికి ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయని పోలీసులు వెల్లడించారు. ఈ పేలుడులో మరో జవాన్‌కు గాయాలయ్యాయని, వారిని సమీపంలోని దవాఖాను తరలించామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News