Thursday, December 19, 2024

మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కాల్పులు..

- Advertisement -
- Advertisement -

గడ్చిరోలి: మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో బుధవారం పోలీసులు, నక్సలైట్ల్లై మధ్య కాల్పుల ఘటన అనంతరం రెండు రాష్ట్రాల పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం, ఇతర మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు గురువారం చెప్పారు. బుధవారం ఈ సంఘటన జరిగినట్లు గడ్చిరోలి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నీలోత్పల్ చెప్పారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వెంబడి చత్తీస్‌గఢ్ బీజపూర్ జిల్లాలోని భోపాలపట్నం ఉత్తరం వైపు స్థానిక నక్సల్స్ బృందమైన సాంద్రా ఎల్‌ఒఎస్, మరికొన్ని గ్రూపుల శిబిరాలు ఉన్నట్లు ఈ నెల 15వ తేదీ రాత్రి తమకు సమాచారం అందినట్లు ఆయన చెప్పారు. ఈ సమాచారాన్ని వెంటనే బీజపూర్ ఎస్‌పి తెలియజేయడం జరిగిందని,

చర్చల అనంతరం అహేరి అదనపు ఎస్‌పి సతీష్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో ఒక జాయింట్ టీమ్‌ను, అలాగే కూబింగ్ ఆపరేషన్ కోసం బీజపూర్ డిప్యూటీ ఎస్‌పి, 70 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ కమాండోలతోపాటు దాదాపు 200 మంది కమాండోలతో గాలింపు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక జాయింట్ టీమ్ గాలింపు కొనసాగిస్తుండగా నక్సలైట్లు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, గాలింపు బృందం కూడా దీటుగా సమాధాన మిచ్చిందని ఆయన చెప్పారు. ఇరుపక్షాల మధ్య కాల్పులు ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో జరిపిన గాలింపుల్లో డెటొనేటర్లు, జిలెటిన్ స్టిక్స్, పెదద మొత్తంలో నక్సల్స్ సాహిత్యం, ఒక మొబైల్ ఫోన్, నాలుగు షోల్డర్ బ్యాగులు, టార్పాలిన్ షీట్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి చెప్పారు. ఆపరేషన్ తర్వాత జాయింట్ టీమ్ క్షేమంగా తమ క్యాంప్‌కు తిరిగి వచ్చిందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News