Wednesday, January 22, 2025

నక్సల్ జంటను హతమార్చిన మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -
Maoists kill Naxal couple in Chhattisgarh
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఘటన

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఒక నక్సల్ జంటను, మరో వ్యక్తిని మవోయిస్టులు వేర్వేరు సంఘటనల్లో చంపివేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గంగలూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతం నుంచి పరారైన ఒక నక్సల్ జంటను మావోయిస్టులు గురువారం కాల్చివేసినట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. అదే ప్రాంతంలో మరో వ్యక్తిని కూడా మావోయిస్టులు కాల్చిచంపారని పోలీసులు తెలిపారు. మావోయిస్టు మిలీషియా ప్లటూన్ కమాండర్ కమ్లూ పూనెమ్, మిలీషియా సభ్యురాలు మంగి ఇటీవల పెళ్లి చేసుకోవడానికి మావోయిస్టు క్యాంపు నుంచి పారిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందినట్లు ఐజి(బస్లర్ రేంజ్) సుందర్‌రాజ్ పి తెలిపారు. అయితే&తమ సహచరుల ఆచూకీని కనిపెట్టిన నక్సల్స్ వారిని పట్టుకుని, ఇందినార్ గ్రామంలో ప్రజా కోర్టు నిర్వహించి హతమార్చారని ఆయన చెప్పారు. నక్సల్స్ హతమార్చిన మూడో వ్యక్తి వివరాలు ఇంకా అందవలసి ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News