Monday, November 18, 2024

4న ఎన్‌కౌంటర్‌లో మరి ఏడుగురు కేడర్ల మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన రెండు వారాల తరువాత ఆ కాల్పుల పోరులో తమ కేడర్‌లు మరి ఏడుగురు మరణించినట్లుగా మావోయిస్టులు అంగీకరించారని, దీనితో ఆనాటి మృతుల సంఖ్య 38కి పెరిగిందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 4 నాటి ఎన్‌కౌంటర్‌లో హతులైన 38 మంది నక్సలైట్లనూ గుర్తించినట్లు, వారిపై ఉమ్మడిగా రూ. 2.62 కోట్ల బహుమతి ఉందని పోలీసులు తెలియజేశారు. 24 ఏళ్ల ఛత్తీస్‌గఢ్ చరిత్రలో ఒక్క ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు అంత అధిక సంఖ్యలో హతులయ్యారని పోలీసులు తెలిపారు. నారాయణ్‌పూర్ దాంతెవాడ జిల్లాల సరిహద్దులో థుల్థులి, నెందూర్ గామాల మధ్య ఒక అడవిలో అభూజ్‌మాడ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ అనంతరం భద్రత సిబ్బంది 31 మంది నక్సలైట్ల మృతదేహాలను,

ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనంచేసుకున్నారు. రాష్ట్ర పోలీస్ జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) సంయుక్త బృందం ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నది. అదే ఎన్‌కౌంటర్‌లో మరి ఏడుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు నిషిద్ధ సిపిఐ (మావోయిస్ట్) తూర్పు బస్తర్ డివిజన్ ఒక ప్రకటనలో ధ్రువీకరించిందని, కాల్పుల పోరు సమయంలో వారి మృతదేహాలను ఆ బృందం తమ వెంట తీసుకువెళ్లిందని దాంతెవాడ పోలీస్ సూపరిటెండెంట్ (ఎస్‌పి) గౌరవ్ రాయ్ తెలిపారు. వారి ఒప్పుకోలుతో ఆ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 38 మంది నక్సలైట్లను హతం చేసినట్లు, వారందరి గుర్తింపును నిర్ధారించుకున్నట్లు ఎస్‌పి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News