Monday, December 23, 2024

జార్ఖండ్‌లో 27 వాహనాల్ని తగులబెట్టిన మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

Maoists set fire to 27 vehicles in Jharkhand

 

గుమ్లా: జార్ఖండ్‌లో అనుమానిత మావోయిస్టులు 27 వాహనాల్ని తగులబెట్టారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. బాక్సైట్ గనికి సమీపంలోని షెడ్‌లో ఉన్న వాహనాలను తీవ్రవాదుల బృందం తగులబెట్టిందని తెలిపారు. వాటిలో కొన్ని ఖనిజాల సరఫరాకు వినియోగించేవని, మరికొన్ని కార్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటలవేళ తీవ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. గుర్దారీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందన్నారు. తీవ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చేపట్టామని స్థానిక ఎస్‌పి ఎహెత్‌శ్యామ్‌వాకరిబ్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News