Friday, December 20, 2024

పది వాహనాలకు మావోయిస్టుల నిప్పు

- Advertisement -
- Advertisement -

Maoists set fire to ten heavy vehicles on Sunday

 

లాతేహర్ : జార్ఖండ్‌లో మావోయిస్టులు ఆదివారం పది భారీస్థాయి వాహనాలను తగులబెట్టారు. వెనుకబడ్డ లాతేహర్ జిల్లాలో రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి ఈ వాహనాలను వివిధ స్థాయిల్లో వాడుతున్నారు. శనివారం రాత్రి తరువాత నక్సలైట్లు మహూద్నర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బస్కర్చ గ్రామ ప్రాంతానికి వచ్చి అక్కడ నిలిపేసి ఉంచిన ఎక్సవేటర్లు, ఓ కంపెనీకి చెందిన ట్యాంకర్లకు నిప్పంటించారు. తరువాత సమీపంలోని మరో ప్రాంతంలో ఇసుక సిమెంట్ కలిపేందుకు వాడే మిక్సర్ మిషన్ల వాహనాలను తగులబెట్టారు. వాహనాలను తగులబెట్టింది తామేనని తెలియచేస్తూ మావోయిస్టులు ఇక్కడ కాగితాలు పెట్టి వెళ్లినట్లు డిఎస్‌పి రాజేష్ కుజుర్ తెలిపారు. నిర్మాణ పనుల్లో కంపెనీల వారి వద్దకు వెళ్లి మామూళ్లు అడిగారని వారు నిరాకరించడంతో ఈ చర్యకు దిగారని డిఎస్‌పి ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News