Sunday, January 19, 2025

నిర్మాణ పనుల్లోని 14 వాహనాలకు నక్సల్స్ నిప్పు

- Advertisement -
- Advertisement -

దంతేవాడ : ఛత్తీస్‌గఢ్ లోని దంతేవాడ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు చెందిన 14 వాహనాలకు, యంత్రాలకు అనుమానిత నక్సల్స్ నిప్పు పెట్టారు. భన్సీ పోలీస్ స్టేషన్ పరిధి లోని బంగాలి శిబిరం వద్ద సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీస్‌లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దాదాపు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు సాధారణ దుస్తుల్లో అక్కడకు వచ్చారు. వీరిలో కొందరు ఆయుధాలు కలిగి ఉన్నారు.

14 వాహనాలు, యంత్రాలు, ట్రక్కులు, పొక్లయిన్, ఎర్త్‌మూవింగ్ మెషిన్లును తగులబెట్టారు. వీటిలో 13 వాహనాలు, యంత్రాలు ప్రైవేట్ నిర్మాణ సంస్థవి కాగా, ఇవి దంతేవాడ బచేలీ రోడ్డు నిరాణానికి ఉపయోగమవుతున్నాయి. వాటర్ ట్యాంకర్ రైల్వే పనులకు చెందినది. ఈ సంఘటన సమాచారం తెలియగానే భన్సీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేతృతంలో పోలీస్ బృందం ఆ ప్రదేశానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News