Monday, December 23, 2024

జార్ఖండ్‌లో మావోయిస్టుల దుశ్చర్య: నాలుగు వాహనాలు దగ్ధం

- Advertisement -
- Advertisement -

లతేహర్: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో మేడె భారీ వాహనాలను, ఒక కారును దగ్ధం చేసిన మావోయిస్టులు ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఉద్యోగులపై దాడి చేశారు. చంద్వాలోని చట్టి నద వంతెన సమీపంలో ఒక రైల్వే ఇర్మాణ స్థలం వద్ద ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

మూడు భారీ వాహనాలు, ఒక కారుకు నిప్పుపెట్టిన మావోయిస్టులు ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఉద్యోగులపై దాడి చేశారని వారు ఎప్పారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసు బందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.

సరిగ్గా నెలరోజుల క్రితం జార్ఖండ్‌లోని పలము జిల్లాలో నిషిద్ధ సిసిఐ(మావోయిస్టు)కు చెందిన కొందరు సభ్యులు ఒక ప్రైవేట్ రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన ఆరు వాహనాలను తగలబెట్టి ఇద్దరు ఉద్యోగులపై దాడి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News