Sunday, December 22, 2024

బూటకపు ఎన్‌కౌంటర్లపై ప్రభుత్వాలను హెచ్చరిస్తూ మావోల లేఖ

- Advertisement -
- Advertisement -

బూటకపు ఎన్‌కౌంటర్లను హెచ్చరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోలు శుక్రవారం లేఖ రాశారు. అల్లూరి డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్ట్ పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. భారత విప్లవోద్యమం నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక దాడిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను దొరక బట్టి చంపుతున్నారని.. బూటకపు ఎన్‌కౌంటర్లను నిజమైన ఎన్‌కౌంటర్లగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆపరేషన్ కగార్ దాడి విప్లవ ప్రతి ఘాతుకం సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడిలో భాగమేనని చెప్పారు.

మూడున్నర నెలల కాలంలో 60 మంది అమాయక ఆదివాసీ మహిళలు పిల్లలను వృద్ధులను పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాజ్యమే ఆదివాసీ గ్రామాలపై డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తున్నారని చెప్పారు. ఉపా లాంటి క్రూర చట్టంతో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఛత్తీస్ గడ్ నరమేధంపై పౌర హక్కులు కార్మిక కర్షక విద్యార్థి మేధావి లోకం సంఘీభావంగా నిలవాలని కోరుతున్నామని తెలిపారు. మావోయిస్టు అధికార ప్రతినిధి ఆజాద్ పేరుతో ఈ లేఖ విడుదల అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News