Monday, December 23, 2024

బుమ్రా కంటే గొప్ప బౌలర్‌నని చెప్పిన అండర్ 19 బౌలర్

- Advertisement -
- Advertisement -

 

కేప్‌టౌన్: అండర్ 19 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా విజయ ఢంకా మోగించింది. వెస్టిండీస్ జట్టుపై 31 పరుగుల తేడాతో సఫారీ జట్టు గెలిచింది. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ బౌలర్ క్వేనా మఫాకా ఐదు వికెట్ల పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. 9.1 ఓవర్లలో 38 పరగులు ఇచ్చి ఐదు వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వికెట్ తీసిన ప్రతీసారి టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా తరహాలోనే సంబరాలు చేసుకున్నాడు. ప్రపంచ కప్ ముందు తన సోదరుడిని వికెట్ తీసినప్పుడు ఎలా సెలబ్రేషన్స్ చేసుకోవాలని అని అడిగాను. కానీ అతడు తెలియదని సమాధానం ఇవ్వడంతో వెంటనే నేను ఐ డోంట్ నో సెలబ్రేషన్స్ అని చెప్పి నవ్వుకున్నానని వివరణ ఇచ్చాడు. బుమ్రా వికెట్ తీసినప్పుడు పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోడు. వరల్డ్ క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ బౌలర్ అని కితాభిచ్చాడు. బుమ్రా కంటే తాను గొప్ప బౌలర్ నని మఫాకా ఒక ఇంటర్వూలో చెప్పాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News