Monday, December 23, 2024

మాపెల్స్‌ రియల్‌ వ్యూను విడుదల చేసిన మ్యాప్‌ మై ఇండియా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశంలో సుప్రసిద్ధ అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ మ్యాప్స్‌, డీప్‌ టెక్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీ మ్యాప్‌ మై ఇండియా ఇప్పుడు ప్రజల కోసం మాపెల్స్‌ రియల్‌ వ్యూ ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశపు మొట్టమొదటి, పూర్తి దేశీయ ఆల్‌ ఇండియా 360 డిగ్రీ పనోరమిక్‌ స్ట్రీట్‌ వ్యూ మరియు 3ఈ మెటావర్శ్‌ మ్యాప్‌ సేవలను భారతదేశపు సొంత, ఉచిత మ్యాపింగ్‌ పోర్టల్‌ మాపెల్స్‌ డాట్‌ కామ్‌ (Mappls.com)పై వీక్షించవచ్చు. మొబైల్స్‌ మరియు డెస్క్‌టాప్‌లపై అందుబాటులో ఉండే వెబ్‌తో పాటుగా మాపెల్స్‌ యాప్‌ ఇప్పుడు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌పై కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా మ్యాప్‌మై ఇండియా సీఈవో మరియు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రోహన్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ మాపెల్స్‌ రియల్‌ వ్యూ ఇప్పుడు https://www.mappls.com మరియు మాపెల్స్‌ యాప్‌పై లభ్యమవుతుంది. వినియోగదారులు వర్ట్యువల్‌గా భారతదేశాన్ని గతంలో ఎన్నడూ చూడని రీతిలో అన్వేషించడంతో పాటుగా వీధుల అందాలు, రోడ్లు, పలు పర్యాటక ప్రాంతాలు, గృహ, వాణిజ్య ప్రాంతాలు, హైవేలను వీక్షించవచ్చు. విదేశీ మ్యాప్‌ యాప్‌లకు భిన్నంగా దేశీయ ప్రత్యామ్నాయం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సామర్థ్యం పరంగా అత్యాధునికమైనది కావడంతో పాటుగా వినియోగదారులకు మరింత విలువనూ అందిస్తుంది. భారతదేశంలోని వినియోగదారులు మాపెల్స్‌ వినియోగించడంతో పాటుగా మాకు తగిన ఫీడ్‌బ్యాక్‌ అందించగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు. వినియోగదారులు మాపెల్స్‌ రియల్‌ వ్యూను పూర్తి ఉచితంగా మాపెల్స్‌ డాట్‌ కామ్‌ పోర్టల్‌ లేదా మాపెల్స్‌ యాప్‌ పై పొందవచ్చు.

Mapmyindia launched Mappls Realview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News