Monday, January 20, 2025

అగ్నిపర్వతం విస్ఫోటనం: 23 కు పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

బాటుపలానో (ఇండోనేషియా) : ఇండోనేషియా లోని మౌంట్ మరపి విస్ఫోటనంలో మృతుల సంఖ్య 23 కు పెరిగింది. ఆదివారం విస్ఫోటనం జరగ్గానే ప్రాథమికంగా 11 మంది మృతి చెందారని వెల్లడించారు. అయితే సోమవారం మరోసారి విస్ఫోటనం నుంచి వేడి బూడిద 800 మీటర్ల (2620 అడుగులు) ఎత్తున గాలి లోకి ఉవ్వెత్తున లేవడం, లావా ప్రవహించడంతో తాత్కాలికంగా గాలింపు చర్యలను ఆపేశారు.

తాజాగా విస్ఫోటనానికి సమీపాన మరో ఐదుగురి పర్వతారోహకుల మృతదేహాలు దొరికాయి. మరో 18 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నట్టు వెస్ట్ సుమత్ర ప్రావిన్స్ డిప్యూటీ పోలీస్ చీఫ్ ఎడి మార్డియాంటో చెప్పారు. ఆ 18 మంది మృతదేహాలను గుర్తించగానే ఈరోజు లేదా రేపు ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు.

ఇండోనేషియా జియోలాజికల్ శాఖ సమాచారం ప్రకారం మౌంట్ మరపి దేశం లోనే మూడో అతిపెద్ద అగ్ని పర్వతం. దీని చుట్టుపక్కల మూడు కిమీ వరకు జనసంచారాన్ని నిషేధించారు. పర్వతారోహణకు వెళ్లే వారు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆదివారం పరిమితికి మించి ఎక్కువ మంది పర్వతారోహకులు అక్కడికి వెళ్లడం వల్లనే ప్రాణనష్టం అధికంగా ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News