Friday, November 22, 2024

మరాఠా కోటా ఉద్యమ కార్యకర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముంబయి: మరాఠా కోటా కోసం ఆందోళన చేస్తున్న కార్యకర్త ఒకరు గురువారం ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరాఠాల రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని కొనసాగించాలని తన కులం వారిని కోరుతూ ఉన్న ఒక లేఖ రాసిపెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. జాల్నా జిల్లా అంబడ్ తహసీల్ జికన్‌గావ్ గ్రామానికి చెందిన 43 ఏళ్ల సునీల్ కవాలె బాంద్రా, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య ఉన్నఫ్లైవర్ స్తంభానికి వేళ్లాడుతూ కనిపించాడు.

ఫ్లైఓవర్‌పై ఉన్న విద్యుత్ స్తంభానికి తాడుతో కట్టేసుకున్న అనంతరం అతను అక్కడినుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోవడానికి కొద్ది సేపు ముందు తన తండ్రి తనకు ఫోన్ చేశాడని, అయితే గాలి కారణంగా ఆయన మాట్లాడింది తనకు వినిపించలేదని కవాలె కుమారుడు నగేశ్ చెప్పాడు. ఆ తర్వాత తాను ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోయానని, నిద్ర లేచాక మొబైల్ స్టేటస్ చూసి తాను తిరిగి తండ్రి నంబరుకు ఫోన్ చేశానని, అయితే ఒక పోలీసు ఫోన్ తీసి జరిగిన విషయం చెప్పి తనను సియోన్ ఆస్పత్రికి రావలసిందిగా చెప్పాడని తెలిపారు.

తన తండ్రి అయిదేళ్లుగా మరాఠా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాడని, ఆయన బలిదానం వృథా కాకూడదని నగేశ్ చెప్పాడు. కాగా మరాఠా రిజర్వేషన్ల కోసం ఈ నెల 24న ముంబయిలో సమావేశం కావాలని తన కులానికి చెందిన వారిని కవాలే తన సూసైడ్ నోట్‌లో కోరారు. ముందు మరాఠా రిజర్వేఫన్లు, ఆ తర్వాతనే ఎన్నికలు అని ఆ నోట్‌లో ఉంది. కాగా మరాఠా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మరాఠా క్రాంతిమోర్చాలో కవాలె క్రియాశీల సభ్యుడని, పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News