Friday, November 22, 2024

మరాఠా కోటా ఆందోళన.. సిఎం, మంత్రుల నివాసాల వద్ద మరింత భద్రత

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర లోని మరాట్వాడా రీజియన్‌లో ముగ్గురు ఎమ్‌ఎల్‌ఎల నివాసాలను లక్షంగా చేసుకుని మరాఠా కోటా ఆందోళన కారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మంగళవారం మంత్రాలయ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నాయకుల నివాసాలతోపాటు పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అయితే మరాఠా కోటా ఆందోళన మాత్రం కొనసాగుతోంది.

ఆందోళన కారులు తమ డిమాండ్ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం పుణె నగరం లోని ముంబై బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. టైర్లు దగ్ధం చేశారు. బీడ్ జిల్లాలోను, ధారాశివ్ జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి అధికారులు కర్ఫూ విధించారు. మంగళవారం కేబినెట్ సమావేశం జరగాల్సి ఉన్నందున , రాష్ట్రంలో అక్కడక్కడా హింసాత్మక సంఘటనలు జరిగినందున మంత్రాలయ , తదితర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను పోలీస్‌లు కట్టుదిట్టం చేశారని అధికారులు తెలిపారు.

థానే లోని లూయిస్ వాడిలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధికారిక నివాసం, డిప్యూటీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, మంత్రులు చంద్రకాంత్ పాటిల్, దీపక్ కేసర్కార్, దాదాభూసే, ఇతర నేతలు అంబదాస్ దాన్వే, అశోక్ చావన్, తదితర నేతల నివాసాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News