Friday, December 20, 2024

మరాఠా కోటా ఉద్యమం జల్నాలో 360 మందిపై కేసులు..

- Advertisement -
- Advertisement -

ఔరంగాబాద్ : మహారాష్ట్రలో మరాఠా కోటా ఉద్యమం ఆగబోదని, విస్తరిస్తామని ఆందోళనకారులు తెలిపారు. రాష్ట్రంలోని జల్నాలో శుక్రవారం కోటా ఉద్యమం హింసాత్మకం అయింది. పరిస్థితిని పోలీసులు చక్కదిద్దారు. ఈ క్రమంలోనే వాహనాలకు నిప్పు, ఆస్తుల ధ్వంసం, పోలీసు సిబ్బంది గాయపడటం వంటి పరిణామాలు జరిగాయి. శనివారం పరిస్థితి అదుపులోకి వచ్చింది. హింసాత్మక ఘటనలకు సంబంధించి 360 మందిపై కేసులు దాఖలు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. చాలా మందిపై కేసులు పెట్టామని, అల్లర్లకు బాధ్యులైన వారిలో ఇప్పటికైతే 16 మందిని గుర్తించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిస్థితి చేయిదాటకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. ఉద్యమానికి మనోజ్ జరాంగే నాయకత్వం వహిస్తున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రికి తరలించారు. కాగా తమ డిమాండ్లు తీరే వరకూ ఉద్యమం ఆగబోదని ఉద్యమకారులు శనివారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News