Monday, December 23, 2024

ముంబైలో మరాఠీ మహిళపై గుజరాతీల దౌర్జన్యం(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

ముంబై: నగర శివార్లలోని ములుంద్‌లో గుజరాతీల ప్రాబల్యం అధికంగా ఉన్న ఒక బిల్డింగ్ సొసైటీలో ఆఫీసు స్పేస్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన తనను అక్కడి నివాసులు తరిమివేశారంటూ ఒక మరాఠీ మహిళ చేసిన ఆరోపణలు మహారాష్ట్రలో రాజకీయ కాక పుట్టించాయి.తనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఆ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ములుంద్‌లోని శివ్ సదన్ బిల్డింగ్‌లో ఆఫీసు స్సేప్ కొనుగోలు కోసం భవనాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తృప్తి దేవుఱ్‌కర్ అనే మహారాష్ట్రియన్ మహిళకు బిల్డింగ్ నివాసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. బిల్డింగ్ సొసైటీకి చెందిన ఒక వృద్ధుడితోసహా కొందరు వ్యక్తులు ఆ మహిళను అడ్డుకోవడంతోపాటు ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను లాకుర్దాడి చేయడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపించింది. తమ నిబంధనల ప్రకారం మరాఠీలను అముమతించబోమంటూ గుజరాతీలు ఆమెను అడ్డుకోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

నిబంధనలను తనకు చూపించాలంటూ ఆమె డిమాండ్ చేయగా తమ అనుమతి లేకుండా ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను ఒక వ్యక్తి లాక్కున్నాడు. ఆ వ్యక్తికి అండగా మరికొందరు సొసైటీ సభ్యులు అక్కడకు చేరుకుని ఆమెపై దాడికి దిగారు. తనపై జరిగిన డాదిని వివరిస్తూ ఆ వహిళ వీడియోలో కన్నీటిపర్యంతమైంది. బాహాటంగా వాళ్లు తనను బెదిరించారని, ఏమైనా చేయగలమని చెప్పారని, కాని అక్కడే ఉన్న ఒక మహారాష్ట్రీయులు ఎవరూ తనకు సాయం రాలేదని తృప్తి ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ఈ వైరల్ కావడంతో మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక మరాఠీ మహిళను ఈ రకంగా అవమానించిన సొసైటీ సభ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది అత్యంత దారుణమని, మహారాష్ట్ర రాజధాని ముంబైలోనే మరాఠీ వాళ్లను బహిష్కరిస్తుంటే తాము ఎక్కడకు వెళ్లగలమని తృప్తి ఆవేదన చెందారు. ఇక్కడ తమకు ఆఫీసు లభించకపోతే దాని కోసం గుజరాత్‌కు వెళ్లాలా అంటూ ఆమె ప్రశ్నించారు.
తృప్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ములుంద్ పోలీసులు బుధవారం సొసైటీ సభ్యులపై ఫిర్యాదు నమోదు చేశారు. తృప్తితో వాగ్వివాదానికి దిగిన ప్రవీణ్ ఠక్కర్ అనే వృద్ధుడితోపాటు ఆయన కుమారుడు నీలేష్ ఠక్కర్‌కు సమన్లు జారీచేశారు.

కాగా..మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలె, శివసేన నాయకులు ఆదిత్య థాక్రే, సుష్మ అంధారె, ఎన్‌సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జితేంద్ర అవ్హాద్, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ప్రతినిధి సందీప్ దేశ్‌పాండే, తదితరులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మహిళలతోసహా మరాఠాలపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేక బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం కోసం ఢిల్లీ నాయకులను బాధపెట్టకుండా ప్రసన్నం చేసుకునే పనిలోనే ఉంటారా అంటూ ఆదిత్య థాక్రే రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News