Friday, December 20, 2024

హెచ్‌ఐవి, ఎయిడ్స్ నిర్మూలనలో భాగంగా మారథాన్ 5కె రన్

- Advertisement -
- Advertisement -

 నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో యూత్ ఫెస్ట్ సంబరాలలో భాగంగా రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్, చైల్డ్ ఫండ్ ఇండియా ఎన్‌జిఓ, ఎంఆర్‌డిఎస్ 2 టిఐ ప్రాజెక్టు నాగర్‌కర్నూల్ జిల్లా వైద్య శాఖ సంయుక్తంగా మంగళవారం మారథాన్ 5 కె రన్ నిర్వహించారు. హెచ్‌ఐవి, ఎయిడ్స్ నిర్మూలనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ పోటీల్లో ముగ్గురు బాలికలు, బాలురను పరుగుపందెంలో ఎంపిక చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ లాల్, సుకుమార్ రెడ్డి, డిపిఎంఓ ఎస్ మూర్తి, డిఐఎస్ వైఎస్ నాయుడు, సిఎల్‌ఎం ప్రాజెక్టు పిఎం విజయలక్ష్మి, పిఎం ఎంఆర్‌డిఎస్ టిఐ రామరావు, జూనియర్ లెక్చరర్ పద్మ, ఏఎన్‌ఎం, ఎంఆర్‌డిఎస్ చైల్డ్ ఫండ్ ఇండియా ఎన్‌జిఓ జోనల్ సూపర్వైజర్ రామకృష్ణ, సిఎఫ్‌ఐ లింక్ వర్కర్ శివాని, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News