Monday, December 23, 2024

యువ అథ్లెట్ కెల్విన్ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

నైరోబి: కెన్యాకు చెందిన స్టార్ మారథాన్ అథ్లెన్ కెల్విన్ కిప్టుమ్ దుర్మరణం చెందాడు. 24 ఏళ్ల సంచలన అథ్లెట్ కెల్విన్ కెన్యాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో కెల్విన్ స్వర్ణం సాధించడం ఖాయమని అందరూ భావిస్తుండగా అతను మాత్రం రోడ్డు ప్రమాదం అకాల మరణం చెందాడు. ఈ ప్రమాదంలో అతని కోచ్ గెర్వైస్ హికిజిమానా కూడా ప్రాణాలు కోల్పోయాడు. కెల్విన్ కెన్యాలోని కప్టగట్ నుంచిఎల్డోరెట్‌కు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో మొత్తం ముగ్గరు ఉన్నారు.

కెల్విన్‌తో పాటు అతని కోచ్ గెర్వైస్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మరొకి మహిళా తీవ్రంగా గాయపడింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, కిందటి ఏడాది అక్టోబర్‌లోనే మారథాన్‌లో కెల్విన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అమెరికాలో జరిగిన పోటీల్లో కెల్విన్ నయా రికార్డును సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో అందరి కళ్లూ అతనిపైనే నిలిచాయి. అయితే కెల్విన్ అకాల మృత్యువాత పడడం అతని అభిమానులను షాక్‌కు గురిచేసింది. కెల్విన్ మృతిపై పలువురు ప్రముఖ అథ్లెట్లు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News