Sunday, January 19, 2025

రికార్డు సృష్టించిన మార్కస్ స్టోయినిస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ లో రోజు రోజుకు రికార్డులు బద్దలవుతున్నాయి. ప్రతీ మ్యాచ్‌లో దాదాపుగా 200 పైగానే పరుగులు జట్లు పరుగులు చేస్తున్నాయి. 220 పరుగులు పైగా చేస్తేనే గెలిచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం చెన్నై-లక్నో జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు ముందు సిఎస్‌కె 210 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మార్కస్ స్టోయినిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో లక్నో జట్టు చివర ఓవర్‌లో గెలిచింది. స్టోయినిస్ 124 పరుగులు చేసి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. 88 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగిన మార్కస్ 63 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్స్‌లతో 124 పరుగులు చేసి లక్నో జట్టును గెలిపించాడు. చేధనలో 124 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా స్టోయినీస్ రికార్డు సృష్టించాడు.గతంలో పాల్ వాల్ తాటి 120 నాటౌట్, సెహ్వాగ్(119), సంజూ శాంసన్(119), షేన్ వాట్సన్(117) నాటౌట్‌గా తరువాతి స్థానంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News