Sunday, December 22, 2024

క్యూఏఐతో మారెంగో ఆసియా హాస్పిటల్స్ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: మరెంగో సిమ్స్ హాస్పిటల్, అహ్మదాబాద్ లో స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఇన్ క్వాలిటి & పేషెంట్ సేఫ్టీ ఇన్ స్ట్రోక్ కేర్’ స్థాపించుటకు మరెంగో ఆసియా హాస్పిటల్స్, ది క్వాలిటి అండ్ అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూట్ (క్యూఏఐ) చేతులు కలిపాయి. రాష్ట్రము, ప్రాంతములో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలపరచడముపై దృష్టి కేంద్రీకరిస్తూ, స్ట్రోక్ సంరక్షణ చికిత్సను మెరుగుపరచడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఈ భాగస్వామ్యానికి మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ) ను డా. రాజీవ్ సింఘాల్, మేనేజింగ్ డైరెక్టర్ & గ్రూప్ సీఈఓ ఆఫ్ మరెంగో ఆసియా హాస్పిటల్స్, డా. బి కే రాణా, చీఫ్ ఎక్సిక్యూటివ్ అధికారి, క్వాలిటి & అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూషన్ (క్యూఏఐ) ప్రారంభించారు.

ఒక విద్యా, శిక్షణ, నాణ్యత అభివృద్ధి, అక్రెడిటేషన్/ధృవీకరణ పర్యావరణ వ్యవస్థను స్థాపించుట కొరకు వృత్తినిపుణులు మరియు సంస్థలతో సహా వాటాదారులకు, వారి నైపుణ్యాన్ని మరియు పరిజ్ఞానాన్ని పంచుకోవటానికి, ఒక వేదికను సృష్టించే ఉద్దేశముతో క్యూఏఐ ఏర్పాటు చేయబడి స్థాపించబడింది. క్యూఏఐ లో ఉన్న వర్టికల్స్ లో సెంటర్ ఫర్ అక్రెడిటేషన్ ఆఫ్ హెల్త్ అండ్ సొషల్ కేర్ (సిఏహెచ్‎ఎస్‎సి) ఉంది, ఇది ఆరోగ్యము, సాంఘిక సంరక్షణ రంగములో అక్రెడిటేషన్/ధృవీకరణ కార్యకలాపాలను చూస్తుంది.

చిన్న చిన్న ఆసుపత్రులను కనెక్ట్ చేయడము ద్వారా ప్రాథమిక స్ట్రోక్ కేంద్రాల నెట్వర్క్ ను స్థాపించడం మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ) ప్రాథమిక లక్ష్యము. ఈ కార్యక్రమములో నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్ ను ప్రాథమిక స్ట్రోక్ సంరక్షణ యాజమాన్యము కొరకు, మరెంగో సిమ్స్ హాస్పిటల్, క్యూఏఐ తో అనుసంధానించుకొని, తమను తాము స్థానిక హబ్స్ గా స్థాపించుకొని ఈ కార్యక్రమములో వాటిని భాగం చేసి వాటితో భాగస్వామ్యము, వాటికి ప్రయోజనం చేకూర్చడం ఉంటుంది. ఈ సమగ్ర స్ట్రోక్ కార్యక్రమాన్ని ఇతర క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్ కు విస్తరించి, సమాజములో అవి మరింత ప్రముఖ పాత్రను పోషించుటకు, స్ట్రోక్ రోగులందరికి సమయానికి తగిన సంరక్షణ అందించుటకు అనుకూలపరచడము మా లక్ష్యము.

ఈ ప్రయత్నము ఈ స్ట్రోక్ కేంద్రాలకు ప్రామాణిక స్ట్రోక్ సంరక్షణను అందించుటకు అవసరమైన పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అందిస్తుంది. ఈ భాగస్వామ్యము ద్వారా మేము సమీప కమ్యూనిటీ ఆసుపత్రులను భాగం చేయడం ద్వారా, ఎంసిఐఎంఎస్, క్యూఏఐ భాగస్వామ్యముతో అవి ఎల్1, ఎల్2 స్ట్రోక్ కేంద్రాలుగా ఆవిర్భవించుటకు వారికి శిక్షణను, నైపుణ్యాన్ని అందించడము ద్వారా అహ్మదాబాద్ నివాసితులకు ఉత్తమ స్ట్రోక్ సంరక్షణను అందించాలని ఆశిస్తున్నాము

హ్మదాబాద్ లో శాశ్వతమైన ప్రభావమే లక్ష్యంగా స్ట్రోక్ సంరక్షణలో మొత్తం ఆరోగ్యసంరక్షణ పర్యావరణవ్యవస్థను పెంచే దిశగా ఈ ప్రత్యేక భాగస్వామ్యము ఒక ప్రముఖమైన అడుగు. గుజరాత్ ప్రజల కొరకు మార్గదర్శక కార్యక్రమాలలో మరెంగో సిమ్స్ హాస్పిటల్ ఎప్పుడూ ముందు ఉంది. క్యూఏఐ వంటి గౌరవనీయమైన సంస్థతో భాగస్వామ్యము ఈ ఆసుపత్రి ః శాశ్వత వైద్యపరమైన నైపుణ్యాన్ని నొక్కిచెప్తుంది. నిర్ధారణ సమయాన్ని తగ్గించుటకు ఈ కేంద్రాలను స్ట్రోక్ సాఫ్ట్‎వేర్ లేదా ఏఐ ఆసుపత్రులకు కనెక్ట్ చేస్తూ మరెంగో సిమ్స్ హాస్పిటల్ తో కలిసి ప్రాథమిక స్ట్రోక్ కేంద్రాల నెట్వర్క్ ను స్థాపించడం మా ఉద్దేశము.

డా. రాజీవ్ సింఘాల్, మేనేజింగ్ డైరెక్టర్ & గ్రూప్ సీఈఓ, మరెంగో ఆసియా హాస్పిటల్స్ మాట్లాడుతూ.. “స్ట్రోక్ నిర్వహణ యొక్క కీలకమైన రంగములో, శ్రేష్ఠత్, సాధన ఒక అంకితమైన బాధ్యత. మరెంగో సిమ్స్ హాస్పిటల్ వద్ద న్యూరోసైన్సెస్ లో ఆధునిక సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ నిరంతరం స్ట్రోక్ నిర్వహణలో అసమానమైన రోగి సంరక్షణను అందిస్తూ వచ్చింది. స్ట్రోక్ సంరక్షణ చికిత్సను పెంచటానికి ఈ ఆసుపత్రి గుజరాత్, పరిసర ప్రాంతాలలో ఉన్న న్యూరాలజిస్ట్స్ కొరకు స్ట్రోకాలజిస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ భాగస్వామ్యము ద్వారా, ఒక హబ్ & స్పోక్ మాడల్ ను స్థాపించడం, తద్వారా ఆధునిక స్ట్రోక్ కేంద్రాలు, ప్రాథమిక స్ట్రోక్ కేంద్రాలను ఏర్పాటు చేయడం మా ఉద్దేశము. ‘క్లినికల్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రోక్ పేషెంట్స్’లో శిక్షణను అందించడము మైర్యు ‘అక్రెడిటేషన్ ప్రమాణాల’తో అంకితభావాన్ని నిర్ధారిస్తించడము ద్వారా ఈ కేంద్రాలలో స్ట్రోక్ బృందాల సామర్థ్యాన్ని నిర్మించడములో మేము క్రియాశీలకంగా నిమగ్నం అయ్యాము. స్ట్రోక్, ప్రభావాన్ని తగ్గించుటకు ఇది ‘గోల్డెన్ అవర్’ లో స్ట్రోక్-బాధిత రోగులకు సరైన చికిత్స అందించబడిందని నిర్ధారిస్తుంది, ఎందుకంటే “ప్రతి జీవితము విలువైనది, ప్రతి నిమిషం ముఖ్యమైనది” అన్నారు.

“స్ట్రోక్ సంరక్షణ కొరకు ఒక అధునాతన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మా ఆసుపత్రికి ఉన్న పేరుప్రతిష్ఠతలు పెరుగడం ఒక ప్రముఖ మైలురాయి. గత సంవత్సరం 550 పైగా కేసులలో మా ప్రమేయము ఒక బెంచ్‎మార్క్ ను నెలకొల్పింది. స్ట్రోక్ నిర్వహణలో మా సదుపాయము అత్యున్నత ప్రమాణాలను నెరవేరుస్తుందని రోగులలో విశ్వాసాన్ని పెంచడములో కూడా ఇది ఒక ముందడుగు. తిరుగులేని మా నిబద్ధత, కృషి, అనుగుణమైన మౌలికసదుపాయాలు, వైద్యులకు కఠినమైన శిక్షణను అందించుటకు బాగా-నిర్వచించబడిన శిక్షణ విధానాలు, సుస్థిరమైన నాణ్యత ప్రమాణాలను కేంద్రీకృతమైన మా విధానము, వీటన్నిటికి ఈ భాగస్వామ్యము ఒక శాసనము” అని డా. సింఘాల్ అన్నారు.

భారతదేశములో మరణాలకు అతి సాధారణంగా ఉన్న కారణాలలో రెండవది స్ట్రోక్. ప్రతి సంవత్సరం భారతదేశములో సుమారు 1,85,000 స్ట్రోక్స్ సంభవిస్తున్నాయి, అంటే ప్రతి 40 క్షణాలకు ఒక స్ట్రోక్, ప్రతి 4 నిమిషాలకు ఒక స్ట్రోక్ మరణము. భారతదేశములోని వివిధ భాగాలలో గత రెండు దశాబ్దాలలో స్ట్రోక్ యొక్క సంఘటనలు ప్రతి సంవత్సరానికి 100 నుండి 152/100,000 వ్యక్తులకు ఉన్నాయి. భారతదేశములోని యువతలో పెరుగుతున్న స్ట్రోక్ కేసులు నిర్లక్ష్యము చేయలేని ఒక ఆందోళనకరమైన ఒరవడి. జీవనశైలి కారణాలు, జన్యుపరమైన సిద్ధత, ఉద్భవిస్తున్న రిస్క్ కారకాలు అన్నీ ఈ ఆందోళనకరమైన పరిస్థితికి దోహదపడతాయి. అవగాహన, విద్య, నివారణాత్మక చర్యల ప్రాముఖ్యతను డా. పాల్ ప్రాధాన్యీకరించారు. గణాంకాలు ఒక స్ట్రోక్ తరువాత ఈ క్రింది అంశాలను తెలుపుతాయి: 10% మంది రోగులు ఇంచుమించు పూర్తిగా కోలుకున్నారు. 25% రోగులు కేవలం మైనర్ బలహీనతలతో కోలుకున్నారు. 40% మంది రోగులు ప్రత్యేక సంరక్షణ అవసరమయ్యే మధ్యస్తము-నుండి తీవ్రమైన బలహీనతలను అనుభవించారు. అంటే స్ట్రోక్స్, వాటి ఫలితాల గురించి ప్రజలకు నిరంతరం తెలియడం మరింత కీలకం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News