హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో రామోజీ నివాసానికి ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు చేరుకున్నారు. మార్గదర్శి కేసులో ఎండి శైలజా కిరణ్‌ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామోజీ గ్రూప్ కంపెనీలకు ఫండ్స్ మళ్లించినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను ఇటీవలే అటాచ్ చేసినట్టు సిఐడి గుర్తించింది.
Also Read: కుమార్తె బతికుండగానే చావు కబురు పంపిన తండ్రి
మార్గదర్శికి సంబంధించిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను అటాచ్ చేశారు. మార్గదర్శి చైర్మన్, ఎండి, ఫోర్‌మెన్, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్టు గుర్తించారు. చిట్స్ ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్ము మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో 1989 చిట్స్ గ్రూపులు, తెలంగాణలో 2316 చిట్స్ గ్రూపులు క్రీయాశీలకంగా ఉన్నాయి. నగదు ఎక్కడికి మళ్లించారనే కోణంలో ఎపి సిఐడి దర్యాప్తు చేస్తుంది. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకు ఆస్తుల అటాచ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నారు. చిట్‌ఫండ్ నిబంధనలు ఉల్లఘించినట్లు సిఐడి గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే మార్గదర్శి బ్రాంచ్‌ల్లో సిఐడి సోదాలు చేస్తుంది.